HomeTelugu Trendingఆ వీడియో చూసి చాలా బాధపడ్డా.. అభిమానులకు రాఘవా లారెన్స్‌ పోస్ట్‌.. వీడియో వైరల్‌

ఆ వీడియో చూసి చాలా బాధపడ్డా.. అభిమానులకు రాఘవా లారెన్స్‌ పోస్ట్‌.. వీడియో వైరల్‌

8 19తమిళ స్టార్‌ రాఘవా లారెన్స్‌.. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ ఎత్తులో ఉన్న తన కట్‌ అవుట్‌కు పాలాభిషేకం చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. లారెన్స్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘కాంచన 3’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఓ థియేటర్‌ వద్ద లారెన్స్‌ది భారీ కట్‌అవుట్‌ ఏర్పాటు చేశారు. ఆయన కట్‌అవుట్‌ను దైవంగా భావిస్తూ ఓ అభిమాని పూలమాల వేసి, పాలాభిషేకం చేశారు. క్రేన్‌ కొక్కీకి వేలాడుతూ ఆయనపైకి వెళ్లి మళ్లీ అభిషేకం చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన లారెన్స్‌ సోషల్‌మీడియాలో స్పందించారు.

‘ఇది అభిమానులు, స్నేహితులకు నా విన్నపం. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ నా బ్యానర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియోను చూశా. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధపడ్డా. ఇలాంటి రిస్క్‌లను తీసుకోవద్దని నా అభిమానుల్ని కోరుతున్నా. మీ ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి.. నాపై ఉన్న ప్రేమను ఇలా చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. వాళ్లని మనసులో ఉంచుకుని ప్రవర్తించండి. నిజంగా మీకు నాపై ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే.. పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వండి. వారి ఫీజులు కట్టండి. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు చాలా మంది ఉన్నారు.. వారికి సహాయం చేయండి. అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి పనుల్ని నేను ప్రోత్సహించను. మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదని కోరుతున్నా. మీ జీవితం ఎంతో ముఖ్యమైంది.. దాన్ని గుర్తు పెట్టుకోండి’ అని లారెన్స్‌ పోస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu