HomeTelugu Trendingచంద్రముఖి-2 తెలుగు రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

చంద్రముఖి-2 తెలుగు రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Chandramukhi2 release
రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు రూపొందించారు.

చంద్రముఖి-2 మూవీని తెలుగు, త‌మిళం, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ మూవీని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు.

‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఓ వైపు హర్రర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టమైంది. ‘చంద్రముఖి’గా కంగనా రనౌత్ మెప్పించబోతుంది. ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu