HomeTelugu Trendingకొత్త సినిమా ప్రకటించినున్న దర్శకేంద్రుడు

కొత్త సినిమా ప్రకటించినున్న దర్శకేంద్రుడు

Raghavendra rao will be ann

టాలీవుడ్ డైరెక్టర్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రేపు తన చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్టోబరు 9న ఉదయం 11.30 గంటలకు తన కొత్త చిత్ర ప్రకటన ఉంటుందని వివరించారు. రాఘవేంద్రరావు చివరి 2017లో అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయన ఇప్పటివరకు మరో చిత్రం చేయలేదు. తాజాగా కొత్త వాళ్లతో సినిమా తీయాలని రాఘవేంద్రరావు ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఆయనే నిర్మాత అని సమాచారం. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu