నానికి హ్యాండ్ ఇచ్చాడు!

టాలీవుడ్ లో ఉన్న దర్శకులు ఇతర భాషల్లో నిష్ణాతులైన టెక్నీషియన్స్ ను తమ సినిమా కోసం ఇక్కడకు తీసుకొస్తున్నారు. కావాలని ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తెప్పించుకుంటున్న ఈ టెక్నీషియన్లకు మన దర్శకులకు సింక్ కాకపోవడం దీంతో ఆ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ సినిమా నుండి వాకవుట్ చేయడం ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. తాజాగా నాని సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని సమాచారం. నాని.. దర్శకుడు వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎంసిఏ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా కోసం దివకర్ మణి అనే సినిమాటోగ్రాఫర్ ను రంగంలోకి దింపారు. ఛాయాగ్రహకుడిగా ఆయనకు మంచి పేరుంది. తెలుగులో మొదటిసారి నిఖిల్ నటించిన ‘కేశవ’ సినిమాకు పనిచేశారు. ఆ పనితనం నచ్చడంతో నాని సినిమాకు ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు దర్శకుడు వేణుశ్రీరామ్ కు దివకర్ మణికి సరిగ్గా సింక్ కాకపోవడంతో అతడు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని తెలుస్తోంది.