HomeTelugu Trendingమే14న 'నారప్ప'

మే14న ‘నారప్ప’

Venkatesh Narappa on May

విక్టరీ వెంకటేష్‌ తమిళ ‘అసురన్’‌ తెలుగులో ‘నారప్ప’గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి కనిపించనుంది. వీరి కొడుకుగా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ నటుడు కార్తీక్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రావు రమేశ్‌‌, రాజీవ్‌ కనకాల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ బ్యానర్స్‌లో డి.సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవికి థియేటర్లలో సందడి చేస్తామని చెప్పిన చిత్రయూనిట్‌ మాట నిలబెట్టుకుంది. మే 14న వేట మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైందని వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu