HomeTelugu Big Storiesధోని రిటైర్మెంట్‌పై జక్కన్న, మంచు విష్ణు ట్వీట్లు

ధోని రిటైర్మెంట్‌పై జక్కన్న, మంచు విష్ణు ట్వీట్లు

Rajamouli and manchu vishn

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనూహ్య నిర్ణయం తీసుకొని క్రీడాభిమానులు ఊహించని షాకిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎంఎస్ ధోని చేసిన ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, పేరు మారుమోగుతోంది. చిన్న- పెద్ద, సాధారణ- సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ క్రికెట్ దిగ్గజం రిటైర్మెంట్‌పై చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో ధోని అందించిన విజయాలు, 16 ఏళ్ళ పాటు టీమ్ ఇండియాకు మహీ చేసిన సేవలు గుర్తుచేసుకుంటూ ఆయనకు వీడ్కోలు చెబుతున్నారు. అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీలు అంతర్జాతీయ క్రికెట్‌కి ఆయన చేసిన సేవలపై అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు ధోని రిటైర్మెంట్‌పై సందేశాలు పోస్ట్ చేయగా.. దర్శక ధీరుడు రాజమౌళి, మంచు విష్ణు చేసిన ట్వీట్స్ సినీ, క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu