HomeTelugu Big Storiesఆర్‌.ఆర్‌.ఆర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోస్టర్స్.. వైరల్‌

ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోస్టర్స్.. వైరల్‌

8 8తమ అభిమాన హీరో కొత్త సినిమా ప్రారంభమైతే అభిమానులకు పండగే. అది విడుదలయ్యే వరకూ ఆ సినిమాకు సంబంధించిన చిన్న వార్తను కూడా ఎంతో ఆసక్తిగా చదువుతారు. అదే స్టార్‌ హీరోల సినిమాలకైతే ఆ క్రేజ్‌ మరో రేంజ్‌లో ఉంటుంది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఇలా ఏది విడుదల చేసినా, అది రికార్డులు సృష్టించాలని భావిస్తారు. సామాజిక మాధ్యమాల వేదికగా వాళ్లే ప్రమోట్‌ చేస్తారు. సాధారణంగా మాస్‌, కమర్షియల్ సినిమాల విషయంలో తమ హీరో లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసేదాకా వేచి చూస్తారు. అయితే, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విషయంలో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇందులో ఎన్టీఆర్‌.. కొమరం భీంగా, రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

8a 1

సినిమా మొదలై నెలలు గడుస్తున్నా, ఇందులోని వారి లుక్‌ను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. దీంతో అభిమానులు రంగంలోకి దిగిపోయారు. కొమరం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరిగా రామ్‌చరణ్‌ లుక్‌ను సొంతంగా క్రియేట్‌ చేసి సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. వాటిని చూస్తే, చిత్ర బృందమే స్వయంగా విడుదల చేసిందా? అన్నంత స్పష్టంగా ఉంటున్నాయి. కొన్ని సెకన్ల పాటు మన కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయి. ఇద్దరు కథానాయకులు పోషిస్తున్న చారిత్రక పాత్రలు మనకు తెలిసినవే కావడంతో అభిమానులు ఇంత చక్కగా ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ పోస్టర్లను క్రియేట్‌ చేస్తున్నారు. అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన ఒక్క ఫొటోను కూడా జక్కన్న టీం విడుదల చేయలేదు. (పై పోస్టర్‌ తప్ప..) ఈ నేపథ్యంలో అభిమానులు తయారు చేసిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి. వాటిని మీరూ చూస్తే, వారి క్రియేషన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

8b

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!