దొంగా-పోలీస్ కథతో రాజమౌళి

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, తారక్ లతో ఒక భారీ మల్టీ స్టారర్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బోయపాటితో చేస్తున్న సినిమా ముగియగానే ఈ సినిమా మొదలుకానుంది. ఇలా ముగ్గురు పెద్ద స్టార్లు కలిసి చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఈ అంచనాలనతో పాటే సినిమా అన్నదమ్ముల కథగా ఉంటుందని, ఇద్దరు బాక్సర్ల స్టోరీగా ఉంటుందని రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అవేవీ కాదని ఇదొక దొంగా-పోలీస్ కథగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.