టీవీ సీరియల్ కు రాజమౌళి ప్లానింగ్!

బాహుబలి రెండో పార్ట్ విడుదలవుతున్న నేపధ్యంలో రాజమౌళి తదుపరి సినిమా ఏం చేస్తాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. గరుడ, మహాభారతం వంటి భారీ ఫ్రాంచైజ్ లకు రాజమౌళి శ్రీకారం చుడతారనే వార్తలు జోరుగా వినిపించాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆయనొక టీవీ సీరియల్ ప్లాన్ చేస్తున్నారు. అవునండీ.. నిజమే రాజమౌళి టీవీ సీరియల్ చేయబోతున్నాడట. ఆయనేంటి టీవీ సీరియల్ తీయడమేంటి అనుకుంటున్నారా..? దాని వెనుక ఓ స్టోరీ ఉంది. 
 
బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు అందులో శివగామి పాత్రను వివరిస్తూ ఆనంద్ నీలకంఠన్ అనే రైటర్ ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ అనే నవలను రచించారు. ఆ నవలలో శివగామి, కట్టప్పల పాత్ర గురించి ప్రస్తావించారట. రాజమౌళి అనుమతి తీసుకొని నీలకంఠన్ ఆ రచన చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం నవలలో నలభై పాత్రలను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా చేసుకొని ఒక టీవీ సీరియల్ చేస్తామని ఇటీవల రాజమౌళి తెలిపారు. అయితే ఇది రొటీన్ సీరియల్ కాదని, మొత్తం పదమూడు ఎపిసోడ్ లతో ముగిస్తారని తెలిపారు.         
 
 
Attachments