HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌లో తీసుకోవాలి అంటూ.. రాఖీ సావంత్‌ నిరసన

బిగ్‌బాస్‌లో తీసుకోవాలి అంటూ.. రాఖీ సావంత్‌ నిరసన

Rakhi sawant as spider woma

బాలీవుడ్‌ బ్యూటీ రాఖీ సావంత్.. బిగ్‌బాస్ లోకి ఆహ్వానించాలని స్పైడర్ ఉమెన్ గెటప్‌లో వినుత్నంగా నిరసన వ్యక్తం చేసింది. తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ కు గాను తనను ఆహ్వానించలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా ఇప్పటికే బిగ్‌బాస్ లో రాఖీ సావంత్ రెండు సార్లు వెళ్లింది. ఎవరికి అయినా కేవలం ఒకే ఒక్కసారి అవకాశం దక్కుతుంది. కాని రాఖీ సావంత్ కు మాత్రం రెండు సార్లు ఆఫర్ దక్కింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 1 లో రాఖీ సావంత్ టాప్ 3 లో నిలిచింది. గత సీజన్ లో కూడా రాఖీ సావంత్ పాల్గొంది. పాత కంటెస్టెంట్స్ కు అవకాశం వచ్చిన సమయంలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఓటీటీ బిగ్ బాస్ కు కూడా పాత వారికి ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. దాంతో ఆమెకు అవకాశం వస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కాని ఆమెను నిర్వాహకులు పిలకపోవడంతో ఆమె నిరసన వ్యక్తం చేసేందుకు గాను ఇలా స్పైడర్ ఉమెన్ గెటప్ వేసి రోడ్ల మీద చక్కర్లు కొట్టింది.

ఓటీటీ వర్షన్ కు బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులు బిగ్ బాస్ కు బాగా అలవాటు పడిపోయారు. అందుకే వారికి మరింత ఎంటర్ టైన్ మెంట్ ను ఇచ్చేందుకు గాను బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ ను సమాంతరంగా మొదలు పెట్టబోతున్నారు. ఇది ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్నారను. ప్రముఖ ఓటీటీ లో ఈ బిగ్ బాస్ స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది.

https://www.instagram.com/reel/CSq4uY1I3z7/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu