
రాఖీ సావంత్ బిగ్‌బాస్ సీజన్14 అనంతరం మోస్ట్ ఎంటర్‌టైనర్‌గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఇటీవలె తనను మరోసారి బిగ్‌బాస్ సీజన్-15 ఓటీటీలోకి సైతం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రాఖీ సావంత్ డిమాండ్‌కి బిగ్‌బాస్ అంగీకరించింది. దీంతో ఈ సీజన్ ఓటీటీలోనూ రాఖీకి అవకాశం కల్పించారు. దీంతో గ్రాండ్ డ్రెస్‌తో రాఖీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా ఆమెను కుక్కలు వెంబడించాయి. కారు దిగి సెట్‌లోకి అడుగుపెడుతుండగా అక్కడే ఉన్న కుక్కులు ఆమెను వెంబడించాయి.
దీనికి సంబంధించిన వీడియో రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే అదృష్టవశాత్తూ అవి కరవలేదు. లేదంటే బిగ్‌బాస్ హౌస్ కంటే ముందు ఆమె హాస్పిటల్‌కి వెళ్లాల్సి వచ్చేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ జరుగుతుండగా.. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.
View this post on Instagram
View this post on Instagram













