HomeTelugu Trendingస్టార్‌ హీరోతో 'రాక్షసుడు-2'

స్టార్‌ హీరోతో ‘రాక్షసుడు-2’

Rakshasudu 2 announced
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. రమేష్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ‘రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్ గా ‘రాక్షసుడు 2’ అనే క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రాక్షసుడు’ సినిమా కంటే ఈ సినిమా థ్రిల్లింగ్ గా మరింత భయానకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ చిత్రంలో ఒక స్టార్ హీరో నటించనున్నారని.. త్వరలోనే ఆ హీరో ఎవరనేది ప్రకటిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ‘రాక్షసుడు’ చిత్రం కోసం పని చేసిన సాంకేతిక బృందం మొత్తం ‘రాక్షసుడు 2’ లో భాగం అవుతున్నారు. ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu