రామ్‌చరణ్‌ వర్కవుట్‌ వీడియో.. అభిమానులు రచ్చ..!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రతినాయకులను చితక్కొట్టేందుకు పిడికిలి బిగిస్తే చొక్కా చిరిగేలా.. కండలు చూసి బెదిరేలా కనిపించేందుకు కసరత్తులు చేసే పనిలో ఉన్నాడు. ‘వినయ విధేయ రామ’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్‌ చరణ్.. ఆ సినిమా ఫైట్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం లుక్‌ను పూర్తిగా మార్చుకున్న రామ్‌చరణ్‌.. స్పెషల్‌ డైట్‌తో సిక్స్‌ ప్యాక్‌తో అదరగొడుతున్నాడు.

యాక్షన్ సీన్‌ చిత్రీకరణకు ముందు చరణ్‌ ఎంతగా వర్కవుట్‌ చేస్తాడో చెబుతూ.. ‘మిస్టర్‌ సి.. యూ ఆర్‌ ఏ ట్రూ హీరో’ అనే క్యాప్షన్‌తో ఆయన సతీమణి ఉపానన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో రఫ్‌ లుక్‌తో కనిపిస్తున్న రామ్‌చరణ్‌ను చూసి అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు.