రకుల్ కొత్త బ్రాంచ్!

సినిమాల్లో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే ఉన్నంతలో సంపాదించి వ్యాపారాలు చేస్తుంటారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. కొందరు బట్టలు, నగల వ్యాపారాలు చేస్తుంటే మరి కొందరు సినిమాల్లోనే నిర్మాతలుగా పెట్టుబడులు పెడుతున్నారు. వీరందరికీ రకుల్ భిన్నం. రకుల్ ఫిట్ నెస్ ఫ్రీక్ అనే సంగతి తెలిసిందే. రోజు జిమ్ చేయకపోతే అమ్మడుకి రోజు గడవదు. తన వ్యాపకాన్నే బిజినెస్ గా మొదలుపెట్టింది.

ఎఫ్-45 పేరుతో హైదరాబాద్ లో లగ్జరీ జిమ్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు తన వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. వైజాగ్ లో ఓ బ్రాంచ్ ఓపెన్ చేస్తోంది ఈ బ్యూటీ. ఉక్కునగరంలోని దసపల్ల హిల్స్ లో తన జిమ్ ను ఏర్పాటు చేసింది. ఈ నెల 17న తన చేతుల మీదుగా స్వయంగా ఈ జిమ్ ను ఓపెన్ చేయబోతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని బ్రాంచీలు ఓపెన్ చేస్తుందో .. చూడాలి!