రకుల్ రొమాంటిక్ కోరిక తీరుతుందా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది ఈ భామ. మహేష్, నాగచైతన్య, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరి హీరోలతో జత కడుతూ టాలీవుడ్ క్వీన్ అనిపించుకుంటోంది. గతంలో మహేష్ బాబు తో కలిసి సినిమా చేయడమే నా కల అని చెప్పిన ఈ భామ ఆ కోరిక తీరే వరకు పెళ్లి కూడా చేసుకోనని చెప్పింది. అయితే తాజాగా మురుగదాస్ సినిమాతో తన కోరిక నెరవేరడంతో తన లిస్ట్ లో ఉన్న ఒక్కో కోరికను బయటపెడుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో నటించాలని ఉందని కొత్త కోరికను కోరుతోంది. అంతేకాదు తెరపై ఫుల్ రొమాంటిక్ పాత్రలో కనిపించాలనంటోంది. ఎప్పటినుండో టైటానిక్ సినిమా రేంజ్ లో రొమాన్స్ చేయాలని అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది. ఇటీవలే ‘దృవ’ సినిమాలో ఓ సాంగ్ లో రెచ్చిపోయి నటించిన రకుల్ ఇప్పుడు కథ డిమాండ్ చేయాలేగానీ నో లిమిట్స్ అని పరోక్షంగానే చెప్పేస్తుంది.