రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సెన్సార్‌ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా….
నిర్మాత గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ… ”సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. రామ్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ థియేట‌ర్స్ లో హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈనెల 29న యు.ఎస్ లో ప్రీమియ‌ర్ షోస్ ప్లాన్ చేసాం. యు.ఎస్ లో మొత్తం 92 స్ర్కీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. జూన్ 3న ప్రారంభించిన ఈ చిత్రాన్ని 72 రోజులు షూటింగ్ చేసి పూర్తి చేసాం. ఈ సినిమా ప్రారంభోత్స‌వం రోజే ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేస్తాం అని ఎనౌన్స్ చేసాం. వైజాగ్, హైద‌రాబాద్ లో వ‌ర్షాలు ప‌డ‌డంతో నాలుగు రోజులు షూటింగ్ కి ఇబ్బంది అయ్యింది. మిగ‌తా అంతా మేం ప్లాన్ చేసిన‌ట్టే జ‌రిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ బాగా కోప‌రేట్ చేయ‌డంతో అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ చేసాం. అబ్బూరి ర‌వి సంద‌ర్భానుసారంగా మంచి డైలాగ్స్ అందించారు. మంచి క‌థ‌తో ఓ మంచి సినిమా చేసాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం” అన్నారు.
డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ”అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసి హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హైప‌ర్ మంచి సినిమా. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌తి తండ్రి – కొడుకుకు న‌చ్చే సినిమా ఇది.రామ్ తో సినిమా చేద్దాం అనుకున్న త‌ర్వాత కందిరీగ కంటే బెస్ట్ మూవీ చేయాలి ఎలాంటి సినిమా చేయాలి అని నిర్ణ‌యించ‌డం కోస‌మే 4 నాలుగు డిస్క‌ష‌న్స్ చేసి ఈ క‌థ‌ను ఫైన‌ల్ చేసాం. మంచి క‌థ చెబితే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. స‌క్సెస్ – ఫెయిల్యూర్ మ‌న చేతుల్లో ఉండ‌వు కాబ‌ట్టి వాటి గురించి ఆలోచించకుండా ఓ మంచి సినిమా అందిస్తున్నాం. ఈ మూవీ కోసం ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ డే & నైట్ వర్క్ చేసారు. నేను కాంప్ర‌మైజ్ అయ్యానేమో కానీ…మా నిర్మాత‌లు మాత్రం కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అలాగే మ‌ణిశ‌ర్మ ఎక్స్ ట్రార్డిన‌రీ రీ రికార్డింగ్ అందించారు” అన్నారు.
నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ… ”14 రీల్స్ ఈ హైప‌ర్ చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చింది అంటే 99% క్రెడిట్ డైరెక్ట‌ర్ వాసుకే చెందుతుంది. ఈ సినిమా ధియేట‌ర్స్ కి తండ్రి-కొడుకు క‌లిసి వ‌స్తే.. ఓ కూప‌న్ ఇస్తారు. అలా వ‌చ్చిన కూప‌న్స్ లో డ్రా తీసి గెలిచినవాళ్ల‌కు చ‌దువుకునేందు గాను 5 ల‌క్ష‌లు అంద‌చేయ‌నున్నాం” అన్నారు.
నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ… ”వాసు మోచ్యూర్డ్ డైరెక్ట‌ర్. రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది అని మా న‌మ్మ‌కం. ఈ సినిమాలో ఫాద‌ర్-స‌న్ రిలేష‌న్ తో పాటు మ‌రో యాంగిల్ ఉంది. అది ఈ సినిమాని మ‌రో స్టెప్ ముందుకు తీసుకెళుతుంది” అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates