HomeTelugu Big Stories'దోస్తీ' పాట వింటున్న దోస్తులు.. వీడియో

‘దోస్తీ’ పాట వింటున్న దోస్తులు.. వీడియో

Ram charan and ntr enjoyingటాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతుంది. ఈ సినిమా నుంచి ‘ఫ్రెండ్ షిప్ డే’ స్పెషల్ సాంగ్ ‘దోస్తీ’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ పాటకు మంచి రెస్పన్స్‌ వచ్చింది. అయితే, తాజాగా ఆ పాటను పాడుతూ తారక్, చెర్రీలు కనిపించారు.

కార్ లో పక్కపక్కనే కూర్చుని ఈ పాట హిందీ వెర్షన్ ను వింటూ హమ్ చేస్తూ ఆ ఇద్దరూ కనిపించారు. ఆ వీడియోను డీవీవీ ఎంటర్ టైన్మెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘‘మీరూ.. మీ స్నేహితులతో కలిసి ‘దోస్తీ’ హమ్ చేస్తున్నారా? అయితే.. మీ వీడియోను పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి’’ అంటూ ట్వీట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu