అమీర్ ఖాన్ ‘ఫిట్ టు ఫ్యాట్’!

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు. తాజాగా నటిస్తోన్న ‘దంగల్’ సినిమా కోసం ఏ హీరో చేయలేని ఓ పనిని అమీర్ ఖాన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అమీర్, మహావీర్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో మల్లయుద్ధంలో పాల్గొనేప్పుడు ఫిట్ గా కనిపించాలి… దీని కోసం అమీర్ 25 కిలోలు తగ్గాడు. వివాహం జరిగిన తరువాత పిల్లలు.. పుట్టిన తరువాత మళ్ళీ బరువు పెరిగాడు. ఈ సినిమా కోసం అమీర్ చేసిన కృషి గురించి తెలియజేస్తూ.. చిత్ర నిర్మాణ సంస్థ ఫిట్ టు ఫ్యాట్ అనే వీడియోను విడుదల చేసింది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా డిసంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.