HomeTelugu Trendingరామ్‌చరణ్ బర్త్‌డే కామన్‌ డీపీపై అభిమానుల నిరాశ

రామ్‌చరణ్ బర్త్‌డే కామన్‌ డీపీపై అభిమానుల నిరాశ

Ramcharan Birthday CDPమెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే కామన్‌ డీపీపై అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు. సాధారణంగా హీరోల బర్త్‌డే అంటే అభిమానులు పోటా పోటీగా సెలబ్రేషన్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎంతో హడావుడి చేస్తుంటారు. ముఖ్యంగా కామన్‌ డీపీతో రచ్చ రచ్చ చేస్తుంటారు. చిన్న హీరోల నుంచి పెద్దహీరోల వరకు కామన్‌ డీపీ చేస్తుంటారు. కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఆనవాయితీగా వస్తోంది. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు. అయితే రామ్‌చరణ్ బర్త్‌డే కామన్‌ డీపీ ఓ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఊహించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఓ సాదాసీదా డీపీని హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశాడు. దీంతో సాయి ధరమ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. దీనికంటే మేం చేసిన డీపీలు బెటర్‌గా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu