HomeTelugu Big Storiesముంబై మ‌హాల‌క్ష్మి ఆల‌యంలో కుమార్తెతో రామ్‌ చరణ్‌-ఉపాస‌న‌

ముంబై మ‌హాల‌క్ష్మి ఆల‌యంలో కుమార్తెతో రామ్‌ చరణ్‌-ఉపాస‌న‌

ram charan and upasana visi

 

స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కామినేనిల పాప క్లిన్ కారా నేటితో ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దంపతులు ముంబైలోని మహాలక్ష్మి ఆలయంలో ఆశీస్సులు కోరారు. ఈ జంట ఆలయాన్ని సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లిప్‌లో వారంతా క్లిన్ కారాతో క‌లిసి ఆలయం నుండి బయలుదేరుతూ క‌నిపించారు.

ఆ స‌మ‌యంలో కుమార్తె క్లిన్‌ను ఉపాస‌న‌ చేతుల్లో జాగ్రత్తగా కెమెరా ఫ్లాష్ ల‌ నుండి శిశువు ముఖాన్ని రక్షించింది. అభిమానులు, ఫోటోగ్రాఫర్‌లు ఉత్సాహం చూపించినా కానీ, త‌మ కుమార్తెపై అన‌వస‌ర హ‌డావుడి ప్ర‌భావం లేకుండా చూసుకున్నారు. రామ్ చరణ్ త‌న‌ కారు వద్దకు వెళ్లే ముందు అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు.

చెర్రీ ఉపాసన ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట 14 జూన్ 2012న జరిగిన సాంప్రదాయంగా ఒక్కటైయ్యారు. 2023 ఈ జంట‌కు తీపిగుర్తుల్ని అందించింది అనే చెప్పాలి. రామ్‌ చ‌ర‌ణ్ ఆస్కార్ విజేత‌ ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబ‌ల్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అత‌డి చేతికి చిక్కింది. కుమార్తె క్లిన్ జ‌న‌నం వారికి మరింత ఆనందం కలిగించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu