ఆయన నాకు స్ఫూర్తి.. బయోపిక్‌ చేయాలని ఉంది: రామ్‌చరణ్‌

నాటు నాటు అంటూ శుక్ర‌వారం ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ స్టెప్పులేసిన విష‌యం తెలిసిందే. అయితే ఒక‌వేళ కోహ్లీ బ‌యోపిక్ తీస్తే ఆ ఫిల్మ్‌లో తాను న‌టిస్తాన‌ని టాలీవుడ్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తెలిపాడు. చూడ‌టానికి తాను కోహ్లీ త‌ర‌హాలోనే ఉంటాన‌ని చెర్రీ అన్నాడు.

శుక్ర‌వారం ఢిల్లీలో జ‌రిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో హీరో రామ్ చరణ్ పాల్గొన్న సంగతి తెలసిందే. ఈ సందర్భంగా ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు రామ్‌చరణ్‌. కోహ్లీని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని అన్నారు. కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందని… తనకు అవకాశం వస్తే సంతోషిస్తానని చెప్పారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, సినీ స్టార్లు, క్రికెటర్ల జీవిత చరిత్రలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలన్నీ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Ram Charan Virat Kohli

ఈ క్రమంలో మరిన్ని బయోపిక్ లను తెరకెక్కించేందుకు మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు. కోహ్లీ చరిత్ర కూడా సినిమాకు బాగ్ సెట్ అవుతుంది. కోహ్లీ జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన అన్ని షేడ్స్ ఉన్నాయి. చిన్న తనంలో సాధారణ జీవితం గడపడం, క్రికెటర్ గా ప్రపంచ దిగ్గజంగా ఎదగడం, బాలీవుడ్ నటి అనుష్కతో ప్రేమ, పెళ్లి, క్రికెట్ కెప్టెన్ గా బీసీసీఐనే కంట్రోల్ చేసే స్థాయికి ఎదగడం ఇలా ఎన్నో కోహ్లీ జీవితంలో ఉన్నాయి.

కోహ్లీ బయోపిక్ తెరకెక్కితే భారీ హిట్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఎందరో సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు చరణ్ ఇదే వాఖ్యలు చేశాడు. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య శుక్ర‌వారం జ‌రిగిన తొలి వ‌న్డే స‌మ‌యంలో.. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ.. నాటు నాటు పాట‌పై స్టెప్పులేశాడు. కోహ్లీ డ్యాన్స్ మూవ్స్‌ను టీవీ కెమెరాలు బంధించాయి. ఆ స్టెప్స్ కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates