బుడతడితో రామ్‌ చరణ్‌ ఫన్నీ వీడియో..వైరల్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సెట్‌లో, అక్కడి పరిసరాల్లో ఉన్న చిన్నారులతో ముచ్చట్లు పెడుతుంటారు. ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘వినయ విధేయ రామ’ తదితర సెట్‌లలో ఆయన చిన్నారులతో కలిసి సందడి చేసిన వీడియోలు, ఫొటోలు బయటికి వచ్చాయి. తాజాగా ఆయన ఓ బాబుతో కలిసి జిమ్‌లో తీసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో బుడతడిని ఏదో ప్రశ్న అడిగి, ఆటపట్టిస్తూ కనిపించారు. ఈ ఫన్నీ వీడియో సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కొద్ది సేపట్లోనే ఈ వీడియోను లక్ష మందికిపైగా వీక్షించారు.

చెర్రీ ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆలియాభట్ రామ్‌ చరణ్‌కు జోడిగా నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా అలరించనున్నారు. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్‌కు జంటగా ఒలీవియా మోరిన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

View this post on Instagram

Gym buddies !

A post shared by Ram Charan (@alwaysramcharan) on