ప్రియాంకకూ తప్పని ఆడపడుచు పోరు.. వైరల్‌ వీడియో!

బాలీవుడ్‌ ప్రియాంక చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రియాంక ప్రస్తుతం బ్యాచిలర్‌ పార్టీలతో బీజిగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రియాంక – నిక్‌ జోనాస్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. వీరి వివాహం ఉదయ్‌పూర్‌లో జరుగనుందని బీ-టౌన్‌లో వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తోన్న ప్రియాంక ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కల్గిస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంక పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

ప్రియాంక తనకు కాబోయే ఆడపడుచు సోఫియా టర్నర్‌ను(నిక్‌ జోనాస్‌ సోదరి) భుజాలపై మోస్తు ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ప్రియాంక ‘ఈ రోజుల్లో మరదలి(ఆడపడుచు) కోసం ఎన్నో చేయాల్సి వస్తోంది’ అంటూ కామెంట్‌ చేశారు. ఈ వీడియోకు ‘జే సోదరి’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.