ఓటు గురించి అక్షయ్‌ కుమార్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు.. అక్షయ్‌ రియాక్షన్

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, ప్రజలంతా తాము ఓటు వేశాం.. మరి మీరూ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ.. తమకు వేలికి పెట్టిన సిరా చుక్క కనిపించే ఫొటోలు షేర్ చేస్తూ వస్తున్నారు. సోమవారం ముంబై పోలింగ్ జరగగా.. సినీ ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వికిల్ ఖన్నా కూడా ఓటు వేసి ఆ ఫొటోను షేర్ చేశారు. అయితే, అక్షయ్ కుమార్ ఎందుకు ఓటు వేయలేదని నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరోవైపు మరుసటి రోజు ముంబైలో “బ్లాంక్” మూవీని ప్రత్యేక ప్రదర్శనలో చూసేందుకు వచ్చిన అక్షయ్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.. అదే సమయంలో ఓటు హక్కు గురించి ఓ జర్నలిస్టు అక్షయ్‌ని ప్రశ్నించాడు. దీంతో అక్షయ్ నవ్వుతూ ‘చలియే బేటా’ అంటూ ముందు వెళ్లిపోయాడు. కాగా, పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే ప్రధాని నరేంద్ర మోడీతో నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూ చేశారు అక్షయ్.. మరోవైపు చాలా కాలంగా, ఆయన జాతీయత గురించి ఊహాగానాలు ఉన్నాయి, అనేకమంది అతను కెనడియన్ పౌరసత్వం కలిగి ఉన్నారని చెబుతారు. మరోవిషయం ఏంటంటే… గత నెల మోడీ ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని ప్రోత్సహించాలంటూ ట్విట్టర్‌లో అక్షయ్‌కుమార్‌ను కూడా ట్యాగ్ చేశారు. దీనిపై అక్షయ్ స్పందించారు, “ప్రజాస్వామ్యానికి నిజమైన ముఖ్య లక్షణం ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం కావాలి.. మన దేశంలోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రథమ కర్తవ్యంగా భావించాలని రియాక్ట్ అయ్యారు. ఇక అక్షయ్ కుమార్‌కు ఓటు హక్కు లేకపోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. బాలీవుడ్ నటులు ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోలు పెట్టి… అక్షయ్ ఏడుపు మొహంతో ఉన్న ఫొటోలను కలిపి ఫోస్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.