HomeTelugu Trendingఫైట్స్- సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి: రామ్‌

ఫైట్స్- సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి: రామ్‌

Ram in Skanda Promotions
రామ్ పోతినేని హీరోగా బోయపాటి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

తాజాగా సుమ చేసిన ఇంటర్వ్యూలో రామ్ – శ్రీలీల మాట్లాడారు. ” ఈ సినిమా మాస్ యాక్షన్ జోనర్లో కనిపించినప్పటికీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడుస్తుంది. గౌతమి, ఇంద్రజ, రాజా వంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, ఎక్కడా మీటర్ దాటకుండా ఈ కథ నడుస్తూ ఉంటుంది. ప్రతి డైలాగ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది” అని రామ్ అన్నాడు.

“తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 3 పాటలకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గొప్పగా కొరియోగ్రఫీ చేశాడు. ఫైట్స్ మాత్రమే కాదు సాంగ్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి” అని రామ్ చెప్పాడు. ఇక రామ్ తో సమానంగా స్టెప్పులు వేయడానికి తాను చాలా కష్టపడ్డాననీ, చాలా ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది” అని శ్రీలీల చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!