రామ్ కొత్త టైటిల్ ఇదే..!

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘హైపర్’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దసరా కానుకగా
సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీని తరువాత రామ్ మరో కొత్త సినిమా షూటింగ్ కు రెడీ
అవుతున్నాడు. గతంలో రామ్, కరుణాకరన్ దర్శకత్వంలో ‘ఎందుకంటే ప్రేమంటే’ అనే సినిమాలో
నటించాడు. ఇప్పుడు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధపడుతున్నాడు. ఈ
సినిమా కోసం ‘క్రేజీ ఫీలింగ్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. రామ్ నటించిన
‘నేను శైలజ’ సినిమాలో ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే పాట బాగా పాపులర్ అయింది. యూత్ లో
కూడా ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటలో నుండి తీసుకున్న టైటిల్ ఇది. ఈ చిత్రాన్ని
స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates