HomeTelugu Trending'రామ్‌సేతు' గ్లింప్స్‌ విడుదల

‘రామ్‌సేతు’ గ్లింప్స్‌ విడుదల

ram setu movie glimps
బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘రామ్‌సేతు’ నటిస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని అక్టోబర్‌ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుసగా అప్‌డేట్‌లను ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

రామ్‌సేతును కాపాడటానికి మన దగ్గర మూడురోజులే ఉన్నాయి అని అక్షయ్‌కుమార్‌ డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. టీజర్‌ మొత్తం యాక్షన్‌ సీన్ల్‌తో ఆసక్తి కరంగా సాగింది. ఈ సినిమాలో టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహించాడు. జాక్వైలీన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ భారుచ్చా హీరోయిన్‌గా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!