అరవింద సమేత గురించి రామ్‌చరణ్ ఏమన్నాడు?

“అరవింద సమేత” సినిమాపై హీరో రామ్‌చరణ్‌ స్పందిస్తూ ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉందని అన్నారు. అరవింద సమేత సినిమాను చూసిన రామ్‌చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లోనే ది బెస్ట్‌ నటన‌. బోల్డ్‌ స్టోరీ, అద్భుతమైన దర్శకత్వం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారు తీవ్రమైన డైలాగ్స్‌ రాశారు. జగపతిబాబు గారి నటన, తమన్‌ సంగీతం సినిమాకు బలాలు. పూజా హెగ్డే నటనను పూర్తిగా ఎంజాయ్‌ చేశా. “అరవింద సమేత చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొన్నారు.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 12వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా, యాక్షన్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఎస్‌.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న “RRR”(వర్కింగ్‌ టైటిల్‌)లో చరణ్ నటించనున్నారు. ఈ సినిమాలో తారక్ మరో హీరో. దానయ్య నిర్మాత. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందించనున్నారు. డిసెంబరులో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించబోతున్నారట.