HomeTelugu Trendingమెగాస్టార్‌ చెల్లిగా రమ్యకృష్ణ!

మెగాస్టార్‌ చెల్లిగా రమ్యకృష్ణ!

Ramya Krishnan as chiranjee

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ సందడి చేసింది.

ఇక తెలుగులో చిరు చెల్లెలిగా నయనతార నటిస్తుందని వార్తలు వినిపించాయి. ఆ తరువాత శోభన పేరు వినిపించింది. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ పేరు తెరపైకి వచ్చింది.. 90 లో రొమాంటిక్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంట చిరంజీవి- రమ్యకృష్ణ. ఇప్పటికి కూడా వారిద్దరూ పార్టీల్లో, వేడుకలో కలిసినప్పుడు వారి బాండింగ్ కూడా అలానే ఉంటుంది. మరీ.. ఇప్పుడు ఈసినిమాలో చిరు చెల్లెలిగా చేయడానికి రమ్యకృష్ణ ఎలా ఒప్పుకున్నది అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu