HomeTelugu Trendingతేజ-రానా 'రాక్షస రాజా' ఫస్ట్‌లుక్‌

తేజ-రానా ‘రాక్షస రాజా’ ఫస్ట్‌లుక్‌

rana new movie rakshasa raj

‘నేనే రాజు నేనే మంత్రి’ డైరెక్టర్ తేజ, హీరో దగ్గుబాటి రానా కాంబినేషన్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబో మరో కొత్త సినిమా రాబోతోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. ఈ రోజు దగ్గుబాటి రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ కొత్త ప్రాజెక్టులో రానాను రాక్షసుడిగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కూడా ‘రాక్షస రాజా’ అని ఫిక్స్ చేసినట్లు హీరో, డైరెక్టర్లు అనౌన్స్ చేశారు. అనంతరం ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నుదుట నామాలు, భుజాన గన్, నోట్లో చుట్టతో రానా చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ తో రాక్షస రాజుగా రానా పాత్ర ఎంత వైల్డ్ గా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ రేంజ్ లో ఉండబోతుందా టాక్‌ మొదలైంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu