హీరోగా తేజ కొడుకు ఎంట్రీ

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేమకథా చిత్రాలకు తేజ పెట్టింది పేరు.తన సినిమాల ద్వారా చాలామంది హీరోలను పరిచయం చేశాడు తేజ. అలాంటి తేజ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ .. “పెద్ద హీరోలతో నేను సినిమాలు చేయలేదు .. చేద్దామని నేను ఎవరినీ అడగనూ లేదు. ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాల్లో నాకు షేర్ ఉండేది. ఇక త్వరలో పూర్తి నిర్మాతగా మారతాను. కొత్త దర్శకులకు .. హీరోలకు అవకాశాలు ఇస్తాను” అని అన్నారు.

“మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాను. ఫారిన్ లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు. చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉంటాడు. అయితే హ్యాండ్సమ్ ఉండగానే సరిపోదు. నటన తెలియాలి … తనకంటూ ఒక స్టైల్ ఉండాలి .. అప్పుడే హీరోగా నిలబడతారు. మా అబ్బాయి సినిమాను నేను డైరెక్ట్ చేయాలా? వేరేవారికి అప్పగించాలా? అనేది ఇంకా ఆలోచించలేదు” అని చెప్పుకొచ్చారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates