కల్నల్‌ పాత్ర కోసం కండలు పెంచిన రానా!

నటుడు రానా దగ్గుబాడి కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళ,హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంటాడు. ఆ పద్దతే ఆయన్ను జాతీయ స్థాయి నటుడిగా నిలబెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం చేతి నిండా దక్షిణాది సినిమాల్ని కలిగి ఉన్న రానా తాజాగా హిందీ సినిమా ‘భుజ్-ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’కు సైన్ చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా రానా కల్నల్‌గా కనిపిస్తాడట. సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్ర, సంజయ్ దత్ లాంటి స్టార్ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ దుదయా డైరెక్ట్ చేస్తున్నారు.