‘రంగస్థలం’ శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా..?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రంగస్థలం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఛానల్స్ మధ్య భారీ పోటీ ఏర్పడిందని సమాచారం. ప్రముఖ టీవీ ఛానల్స్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడానికి తనవంతు ప్రయత్నం చేశాయి.

అయితే ఓ టీవీ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం దాదాపు 16 కోట్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ డీల్ ను ఫైనల్ చేసుకోనున్నారని చెబుతున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ సినిమాకు వెరైటీ టైటిల్ పెట్టడంతో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాని కారణంగానే శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ కు పలికాయని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది.