వారసుడు: ‘రంజితమే’ సాంగ్‌ తెలుగు వెర్షన్‌ విడుదల


తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రంజితమే తమిళ వెర్షన్‌ సోషల్‌ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ రాబడుతూ.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు మేకర్స్. ఎస్‌ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. తెలుగు వెర్షన్‌ కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమైనట్టే తాజా సాంగ్‌తో అర్థమవుతుంది.

తమిళంలో వారిసు టైటిల్‌తో వస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌, ప్రభు, శ్రీకాంత్‌, యోగిబాబు, శరత్‌ కుమార్‌, జయసుధ, ఖుష్బూ సుందర్‌ కీ రోల్స్ పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌ ఈ చిత్రాన్ని కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. వారసుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates