జూన్ లో ‘ఆచారి అమెరికా యాత్ర’ రెండో షెడ్యూల్!

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం.. జూన్ నెలలో సెకండ్ షెడ్యూల్ కోసం అమెరికా పయనమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “మే 5న హైద్రాబాద్ లో మొదలైన మొదటి షెడ్యూల్ ముగిసింది. హైద్రాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో భారీ తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. జి.నాగేశ్వర్రెడ్డి గారి విజన్ వల్ల భారీ తారాగణం ఉన్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ సజావుగా సాగింది. జూన్ నుంచి సెకండ్ షెడ్యూల్ ను అమెరికాలో ప్రారంభించనున్నాం. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రానికి మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ హైలైట్ గా నిలుస్తుంది” అన్నారు.