HomeTelugu Big Storiesటీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

8 18అమరావతిలోని సచివాలయంలో ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో సభ్యత్వ నమోదు పై సుదీర్ఘ చర్చ జరిపారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలు నేతలు వెల్లడించారు. సభ్యత్వ నమోదుపై అలసత్వం వహిస్తున్న పార్టీ నేతలపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల్లో మందకొడిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఇంచార్జిలకు గట్టి క్లాస్‌ తీసుకున్నారు. మీకు వ్యక్తిగత పనులుంటే ఎన్నికలు కూడా వాయిదా పడతాయని అనుకుంటున్నారా అంటూ నిలదీశారు. గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారని ఊరుకుంటున్నా. తిట్టకపోతుంటే మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

టీడీపీ సభ్యత్వ నమోదులో మొదటి 3 స్థానాల్లో పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాలు ఉండగా, నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు గ్రామీణంలో సభ్యత్వం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదుపై చర్చించారు. నేతలు సరిగా సభ్యత్వ నమోదుకు హాజరుకాకపోవటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు పనులు చేసి మెప్పు పొందాలి కానీ పార్టీని మోసం చేస్తూ కాదని హితవు పలికారు. ఎన్నికలు వస్తున్నాయనే విషయాన్ని కూడా కొందరు గమనించడం లేదని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు సీరియస్‌గా తీసుకోలేని వారికి మళ్లీ అన్ని పనులూ జరగాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నా కొందరు అర్ధం చేసుకోవడం లేదని, ఇలాగే ఉంటామంటే ఇక ఇంట్లోనే కూర్చుంటారంటూ హెచ్చరించారు. రాబోయే 6 నెలలు తాను కఠినంగానే ఉంటానని స్పష్టంచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu