యువహీరో సినిమాలో రష్మి ఐటెమ్ సాంగ్!

బుల్లితెరపై తమ అందాలతో ఆడియన్స్ ను మెప్పించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అనసూయ, రష్మి గౌతమ్. రష్మి కంటే అనసూయ మరింత ఫాస్ట్ గా సినిమాలు ఒప్పుకుంటుంది. రీసెంట్ గా సాయి ధరం తేజ్ నటిస్తోన్న ‘విన్నర్’ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.

ఇప్పుడు రష్మి కూడా ఐటెమ్ సాంగ్ లో కనిపించడానికి సిద్ధపడుతోంది. వరుస హిట్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒక చిత్రం ‘కిట్టుగాడు వున్నాడు జాగ్రత్త’. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కుక్కలను దొంగిలించే ఓ వెరైటీ పాత్రలో కనిపించనున్నాడు.

వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని డిసంబర్ ఆఖరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో రష్మి తో ఓ ఐటెమ్ సాంగ్ చేయిస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట. ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి.