‘కాంతారా2’ లో సూపర్‌ స్టార్‌?


కన్నడలో చిన్న సినిమాగా తెరకెక్కిన చిత్రం ‘కాంతారా’. ఆ తరువాత ఈ సినిమా తెలుగు సహా పలు ఇతర భాషల్లో విడుదలై భారీ సక్సెస్ అందుకుంది. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక కాంతారా లో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకుల, సినిమా ప్రముఖులతో పాటు విమర్శకుల నుండి సైతం ప్రసంశలు అందుకుంది. ‘కాంతార 2’ పేరుతో ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక కీలక పాత్ర చేయనున్నారని అంటున్నారు.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో భాగంగా రిషబ్ శెట్టిని.. కాంతారా 2 రజినీకాంత్ నటిస్తున్నారా అంటూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు రిష‌బ్ స‌మాధానం మౌనంగా వెళ్లిపోవడంతో నిజంగానే రజినీకాంత్‌ ఇందులో ఒక పాత్ర చేస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. ‘కాంతారా 2’ కూడా మరోస్థాయిలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.

చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో.. రుక్సార్‌ ధిల్లన్‌

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates