క్రికెటర్ పాత్ర ‘రష్మిక’

‘ఛలో, గీత గోవిందం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్ రష్మిక మందన్న. ఇటీవలే నాని సరసన ‘దేవదాస్’ సినిమాలో మెరిసిన ఈమెకు తెలుగులో మంచి ఆఫర్లే ఉన్నాయి. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటున్న ఈమె విజయ్ దేవరకొండ చేస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో సైతం ఒక పాత్రలో నటిస్తోంది. అదే లేడీ క్రికెటర్ పాత్ర. ఆ పాత్ర పేరు లిల్లీ అని కూడ తెలుస్తోంది. మరి ఈ విభిన్నమైన పాత్రలో రష్మిక ఎలా మెప్పిస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిం