HomeTelugu TrendingPushpa-2: Rashmika Mandanna లుక్ లీక్‌..

Pushpa-2: Rashmika Mandanna లుక్ లీక్‌..

Rashmika Mandanna's look leaked from Pushpa-2 shooting
Pushpa-2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో Rashmika Mandanna హీరోయిన్‌గా నటిస్తుంది. ఈమూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి షూటింగ్ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ ర‌ష్మిక మందాన లుక్ లీకైంది. ఎరుపు రంగు చీర‌లో బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి ఉన్న రష్మిక ఫొటోను అభిమానులు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. రష్మిక లుక్‌ అదిరిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవ‌ల యాగంటి ఆల‌యంలో ఈ మూవీ షూటింగ్ విశేషాల‌ను త‌న‌ ఇన్‌స్టా స్టోరీలో ర‌ష్మిక అభిమానుల‌తో పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫొటోను కూడా షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంట‌ర్వ్యూలో ‘పుష్ప‌-2’లోని త‌న పాత్ర గురించి కొన్ని విష‌యాలు వెల్ల‌డించింది. “మూవీలో పుష్ప భార్య‌గా నా పాత్ర బాధ్య‌త‌తో కూడుకుని ఉంటుంది.

మొద‌టి భాగం కంటే రెండో భాగంలో చాలా డ్రామాతో పాటు పాత్ర‌ల మ‌ధ్య వైర్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పార్ట్-2లో అభిమానులు కోరుకునే మ‌సాలా చాలా ఎక్కువ‌గా ఉంటుంది” అని తెలిపింది. ఈ మూవీలో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ఫ‌హాద్ ఫాజిల్‌, జ‌గ‌దీష్ ప్ర‌తాప్ బండారీ, సునీల్, అన‌సూయ‌, రాజ్ తిర‌న్‌దాసు న‌టించారు. ఆగ‌స్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu