HomeTelugu Trendingఅఖిల్‌కు జంటగా రష్మిక!

అఖిల్‌కు జంటగా రష్మిక!

Rashmika Mandanna romance w
అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీ వాసు – వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ దక్కుతుందని అఖిల్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. అయితే మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడు అఖిల్‌. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రష్మిక పలు సినిమాల్లో బీజీగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు #Akhil5 లో అఖిల్ తో రొమాన్స్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu