HomeTelugu Trendingనెగెటివ్ పాత్రలో తమన్నా

నెగెటివ్ పాత్రలో తమన్నా

Tamanna and Nabha Natesh in
బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన అంధాదున్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో విజయవంతమైన ఈ చిత్రం శ్రీరామ్‌ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కింది. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలో హీరోగా నితిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న టబు పాత్ర కోసం తెలుగులో చాలామందిని సంప్రదించారట. ఇప్పటికే ఈ పాత్రకోసం ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. హిందీలో టబు చేసిన పాత్రకు బెస్ట్ జీసినిమా ఫెర్ఫార్మెన్స్‌ అవార్డును సైతం అందుకుంది. కొంత నెగెటివ్ టచ్, కొంత బోల్డ్‌‌గా ఉండే ఈ పాత్రను తెలుగులో కూడా టబు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనసూయ చేయనుందని, ఆ తర్వాత రమ్యకృష్ణ అని అన్నారు. అయితే రెమ్యూనరేషన్‌ విషయంలో రమ్యకృష్ణ సెట్ కాలేదని అంటున్నారు.

తాజాగా ఈ సినిమాలో టబు పాత్రను ఎవరు చేయబోతున్నారో చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. టబు పాత్రలో తమన్నా చేయబోతున్నట్లు తెలిపింది. అలాగే హీరోయిన్‌గా నభా నటేష్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో న‌టిస్తోంది. అంధాధున్ తెలుగు రీమేక్‌ నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu