HomeTelugu Trendingమామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్

మామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్

Mama Maschindra
ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్‌బాబు చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో హంట్ అనే మూవీ కోసం బాగానే హార్డ్ వర్క్ చేశాడు. కానీ అది అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఇప్పుడు మామా మశ్చీంద్ర అనే సినిమాతో రాబోతున్నాడు.

టైటిల్‌ లోనే వెరైటీ చూపించిన సుధీర్ బాబు ఈ మూవీలో 3 విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు నటుడు, నిర్మాత హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

యాక్షన్, డ్రామా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మామా మశ్చీంద్ర మూవీ అక్టోబర్ 6న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రంలో మృణాళిని, ఈషా రెబ్బా హీరోయిన్లు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!