HomeTelugu Big Storiesఆసక్తికరంగా 'రావణాసుర' గ్లింప్స్‌

ఆసక్తికరంగా ‘రావణాసుర’ గ్లింప్స్‌

Ravanasura Movie Glimpse
టాలీవుడ్‌ హీరో మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే నటించిన ‘ధమాకా’ మంచి విజయాన్ని సాధించింది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ గెస్ట్‌ రోల్‌ చేసి మెప్పించాడు. ఈ సినిమాకి రవితేజ నటన కూడా ప్లస్‌ అయింది. దీంతో రవితేజ తరువాతి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమాలో సుధీర్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ ఒకటి. ఈ రోజు రవితేజ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైయ్యాయి.

యాక్షన్‌ సన్నీవేశాలతో కూడిన ఈ గ్లింప్స్‌ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. మ్యూజిక్‌ కూడా గ్లింప్స్‌ కి తగినట్లుగా ఉన్నాయి. ఈ వరుస హత్యల మధ్య చిద్విలాసం చిందిస్తూ రవితేజ సిగార్ ని వెళిగిస్తూ తన యాటిట్యూడ్ ని చూపిస్తున్న తీరు.. పక్కనే ఘోస్ట్ ఆకారం ఫొటోలు.. వున్న తీరు ఇంట్రెస్టింగ్ గా వుంది.

భీమ్స్ మరియు హర్ష వర్ధన్ లు సంగీతం అందిస్తుండగా అభిషేక్ పిక్చర్స్ మరియు రవితేజ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ మేఘా ఆకాష్ ఫరియా అబ్దుల్లా దక్షా నాగర్కర్ పూజితా పొన్నాడ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో.. రావు రమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu