రాజశేఖర్ కి మంచి రోజులు మొదలైనట్లే!

టాలీవుడ్ లు ఉన్న హీరోల లిస్ట్ నుండి రాజశేఖర్ పేరు దాదాపుగా కనుమరుగయ్యే సమయంలో ‘గరుడ వేగ’ రూపంలో ఆయనకి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్లు సన్నీలియోన్ ను రంగంలోకి దింపి సినిమాకు మసాలా మరింత యాడ్ చేశారు. దీంతో సినిమాకు మంచి క్రియేట్ అయింది. రాజశేఖర్ ను కూడా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అందులో భాగంగా దర్శకుడు వెంకట్ ప్రభు.. రాజశేఖర్ ను కలిసి ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కు కూడా కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో సినిమాలు చేయడం వెంకట్ ప్రభు ప్రత్యేకత. అంతేకాదు థ్రిల్లర్ సినిమాలను రూపొందించడంలో ఆయన సిద్ధహస్తుడు. అటువంటి దర్శకుడితో కలిసి పని చేయడం రాజశేఖర్ కు కలిసొచ్చే అంశమే. ఇటీవల ఆయన విలన్ పాత్రలు పోషించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తరహా పాత్రలకు ఓకే చెబితే ఇక జగపతిబాబు మాదిరి రాజశేఖర్ కు కూడా క్రేజ్ పెరగడం ఖాయం. రాజశేఖర్ షూటింగ్ కు సమయానికి రాడనే వాధన ఇండస్ట్రీలో ఉంది. కానీ ఇప్పుడు పాత అలవాట్లను విడిచిపెట్టి టైమ్ కు షూటింగ్ లో జాయిన్ అవుతున్నారని సమాచారం. ఇకగరుడ వేగకు మంచి విజయం దక్కినట్లైతే రాజశేఖర్ కు మంచి రోజులు మొదలవ్వడం ఖాయం. 
 
 
CLICK HERE!! For the aha Latest Updates