HomeTelugu Trending'రావణాసుర' సెంకడ్‌ సింగిల్‌ అప్డేట్‌

‘రావణాసుర’ సెంకడ్‌ సింగిల్‌ అప్డేట్‌

Ravanasura second single up

మాస్‌ మహరాజా రవితేజ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఆయన ఇటీవలే నటించిన ‘ధమాకా’ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో గెస్ట్‌ రోల్‌ చేసి ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచాడు. దీంతో ఆయన కోల్పోయిన తన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు.

ప్రస్తుతం రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘రావణాసుర’ ఒకటి. టైటిల్‌ పోస్టర్‌తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు మేకర్స్‌. ఇటీవలే విడుదలైన రావణాసుర ఆంథమ్‌ తో ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ విడుదలైంది.

‘ప్యార్‌లోన పాగల్‌’ అంటూ సాగే రెండో పాటను ఫిబ్రవరి 18న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించాడు. సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రవితేజ నెగెటీవ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్‌లు అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లాలు సందడి చేయనున్నారు.

అక్కినేని సుశాంత్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఏప్రిల్‌ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu