HomeTelugu Trendingబిగ్‌బీను మెప్పించిన అమ్మాయి పాట.. వైరల్‌

బిగ్‌బీను మెప్పించిన అమ్మాయి పాట.. వైరల్‌

The girl song that impresse
బాలీవుడ్ స్టార్‌ హీరో అమితాబ్ బచ్చన్ కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. కాగా బిగ్‌బీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆసుపత్రి నుంచే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తాజాగా ఆయన ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఓ అమ్మాయి అద్భుతంగా పాడిన వీడియో అది. “కర్నాటక క్లాసికల్ సంగీతాన్ని, పాప్ మ్యూజిక్ ని మిక్స్ చేసి ఎంత అందంగా పాడావు అమ్మా.. ఆ పాట విని ఆసుపత్రిలో ఇంతకముందుకన్నా చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీకు ఎంతో ప్రతిభ ఉంది. దేవుని ఆశీర్వాదం మీకు తప్పక ఉంటుంది” అని బిగ్ బీ ఆ అమ్మాయి పాడిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu