HomeTelugu Trendingరవితేజ 'డిస్కొరాజా' సెన్సారు పూర్తి..

రవితేజ ‘డిస్కొరాజా’ సెన్సారు పూర్తి..

7 16
రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కొరాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U\A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయన సరసన నభా నటేశ్ .. పాయల్ .. తాన్యా హోప్ హీరోయిన్‌గా నటించారు. ముఖ్యమైన పాత్రల్లో సునీల్ .. వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాపై రవితేజ పెట్టుకున్న ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu