‘డియర్‌ కామ్రేడ్‌’ ఫస్ట్‌ మెలోడీ సాంగ్‌ అదుర్స్

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమాలోని తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే’.. అంటూ సాగుతున్న ఈ లిరికల్‌ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ పాటను ఇప్పటివరకు వందసార్లకు పైగా విన్నానని, ఇంకా వినాలపిస్తోందని విజయ్‌ ట్వీట్‌ చేశారు. గౌతమ్‌ భరద్వాజ్‌ పాటను ఆలపించారు. భరత్‌ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates