HomeTelugu Trendingదుబాయ్‌లో 'ఖిలాడి' చివరి షెడ్యూల్‌

దుబాయ్‌లో ‘ఖిలాడి’ చివరి షెడ్యూల్‌

Ravi teja khiladi movie s

మాస్‌ మహా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 90 శాతం పూర్తైంది. మిగతా 10 శాతం షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నారు. చిన్నపాటి షెడ్యూల్ ఒకటి హైద్రాబాద్ లోనే ప్లాన్ చేశారట. ముందుగా దానిని పూర్తి చేసి, ఆ తరువాత షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆ షెడ్యూల్ తో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుందట. అంటే దుబాయ్ లోనే గుమ్మడికాయ కొట్టేస్తారన్న మాట.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్.. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అనసూయ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu